ఓటీటీ లో(కాని)కి విచ్చేసిన "రంభ ఊర్వశి మేనక"

ఓటీటీ లో(కాని)కి విచ్చేసిన "రంభ ఊర్వశి మేనక"


Movie: Rambha Oorvashi Menaka 

OTT: Amazon Prime Video 






మరోసారి అల్లరోడు కామెడీ హీరోగా వచ్చేశాడు... ఆ అల్లరోడి కోసం విచ్చేసారు "రంభ ఊర్వశి మేనక".

ఈ మధ్య కాలంలో తన రెగ్యులర్ పంథాలో కాకుండా విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న అల్లరి నరేశ్‌ మరోసారి కామెడీ  హీరోగా నటించిన ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’. 
బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడులైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఇప్పుడీ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది . అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సుర‌భి, వెన్నెల కిషోర్, రాశిసింగ్‌, విష్ణుప్రియ‌, ప్రిషాసింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు.




సూరి (అల్ల‌రి న‌రేశ్‌) కుటుంబం కొన్ని త‌రాలుగా రంభ ఊర్వ‌శి మేన‌క అనే డ్రామా కంపెనీని నిర్వ‌హిస్తుంటుంది. వారి ద‌గ్గ‌ర పూర్వీకుల నుంచి వచ్చిన ఓ మేజిక్ బుక్ ఉంటుంది. (ఆ బుక్ కు మన మొబైల్ ఫోన్ మాదిరిగా పాటర్న్ లాక్ ఉంటుంది.) ఆ బుక్‌పై స‌రిగ్గా ముగ్గు వేస్తే పైనుంచి రంభ ఊర్వ‌శి మేన‌క దిగి వచ్చి కోరిక‌ల‌న్నీ తీర్చేస్తార‌ని ఓ న‌మ్మ‌కం. ఆ బుక్‌నే న‌మ్ముకున్న కుటుంబం అప్పుల ఊబిలోకి వెళ్లిపోతుంది త‌ప్ప రంభ ఊర్వ‌శి మేన‌క మాత్రం దిగిరారు. 




సూరి కూడా అంతే. చిన్న‌ప్ప‌ట్నుంచీ హీరో కావాల‌నేది అత‌ని క‌ల‌. కానీ, అందుకు త‌గ్గ ప్ర‌య‌త్నాలేవీ చేయ‌కుండా, మేజిక్ బుక్ పేరు చెప్పి అంద‌రి ద‌గ్గరా అప్పులు చేస్తుంటాడు. అలా ఊరి నిండా అప్పులు పెరిగిపోయి క‌ష్టాలు చుట్టు ముడ‌తాయి త‌ప్ప ఆ బుక్ తెరుచుకోదు, ఇంత‌లో సూరి త‌ల్లి మంచం ప‌డుతుంది. ఆమె ప్రాణాలు ద‌క్కాలంటే రూ.ల‌క్ష‌లు అవ‌స‌రం అంటారు వైద్యులు. ఏం చేయాలో దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న సూరి మ‌రోసారి మేజిక్ బుక్‌పై ముగ్గు వేస్తాడు. అనూహ్యంగా ఆ బుక్ తెరుచుకుని పైనుంచి రంభ ఊర్వ‌శి మేన‌క దిగొస్తారు. మ‌రి వాళ్లు సూరి కోరిక‌ల్ని తీర్చారా? లేదా అనేది కథ.

తన కామెడీ టైమింగ్ తో అలరించే అల్లరి నరేష్ మరోసారి నవ్వులు పూయించిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది.





Post a Comment

Copyright © MOVIE MAG Official | Distributed by Blogger Templates | Designed by OddThemes