Irumudi : శివ నిర్వాణ దర్శకత్వంలో, మాస్ మహా రాజా రవితేజ తన రెగ్యులర్ పంథాలో కాకుండా, విభిన్నంగా ప్రయత్నించిన సూపర్ హిట్ మూవీ ఇరుముడి . బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, క్రిటిక్స్ తో పాటు అందరి ప్రశంసలు పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరిస్తుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
Movie: Irumudi
OTT: Netflix
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఓటీటీ లో కూడా అగ్రస్థానం లో నిలిచింది.
నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.
Movie: Viswanath & Sons
OTT: Netflix
Lust Stories 3: లస్ట్ స్టోరీస్ ఫ్రాంచైజీ లో ఇంతకు ముందు వచ్చిన లస్ట్ స్టోరీస్, లస్ట్ స్టోరీస్ 2 వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 3 ఓటీటీ లో అందుబాటులోకి వచ్చింది. సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీఫజల్ తదితరులు నటించిన ఈ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Movie: Lust Stories 3
OTT: Netflix
Thudakkam: ప్రముఖ నటుడు మోహన్ లాల్ కుమార్తె విస్మయ ప్రధాన పాత్రలో నటిస్తూ వెండి తెరకు పరిచయం అయిన చిత్రం తుడక్కమ్. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ మూవీ మలయాళంలో గత నెల విడుదలై మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగుతో పాటు మరి కొన్ని భాషల్లో జియో హాట్ స్టార్ వేదికగా ప్రసారం అవుతోంది.
Movie: Thudakkam
OTT: Jio Hotstar
Makutam: విశాల్ విభిన్న పాత్రలు పోషించిన సినిమా మకుటం. అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని ఆర్ బి చౌదరి నిర్మించారు. ఇటీవల బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు మరి కొన్ని భాషల్లో ప్రసారం అవుతోంది.
Movie : Makutam
OTT:: Amazon Prime





Post a Comment