సౌత్ ఇండియన్ మూవీస్ లో తనదైన స్థానాన్ని సాధించిన కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ త్వరలో ఓటీటీలోకి రానుంది. . అదే.. ‘అక్క’ వెబ్ సిరీస్. ఇందులో కీర్తి సురేష్ తో పాటు మరో బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే లీడ్ రోల్ ప్లే చేసింది. రాధికా ఆప్టే విభిన్న చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది . ఇదిలా ఉంటే గత ఏడాది ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కు సంబంధించిన టీజర్ రిలీజైంది. అయితే దీని తర్వాత మరో అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పై ఓ అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 30 నుంచి "అక్క" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు రానుందని టాక్. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
![]() |
| Akka web series |
కాగా "అక్క", కీర్తి సురేష్ నటిస్తున్న మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం. పైగా ఇందులో ఆమె గ్యాంగ్ స్టర్ గా కనిపించనుండడంతో ఈ సిరీస్ పై భారీ అంచనాలున్నాయి. ఇందులో కీర్తితో పాటు రాధికా ఆప్టే, సీనియర్ నటి తన్వీ అజ్మీ, విశాఖ్ నాయర్, దివ్యా శ్రీపాద తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ డిజిటల్ వింగ్ అయిన YRF ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. "అక్క" వెబ్ సిరీస్ కు ధర్మరాజ్ శెట్టి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించాడు.

Post a Comment