మలయాళం చిత్ర పరిశ్రమ నుండి కొత్త సినిమా వస్తుందంటే సినీ లవర్స్ కు అది మంచి ఎక్స్పీరియన్స్... డిఫరెంట్ టేకింగ్, కొత్త కంటెంట్ తో నాచురల్ లొకేషన్స్.. ఇలా మలయాళీ మూవీస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
మలయాళ పరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్లకు ఓటీటీలో ఉండే క్రేజ్ వేరు. ఆ కోవలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఐస్’ (Eyes). డ్రీమ్‌క్యాచర్ బ్యానర్‌పై టి.ఆర్.షంషుద్దీన్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 9, 2026 నుంచి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. "వాచ్.. డిఫెండ్.. ప్రొటెక్ట్" (Watch. Defend. Protect.) అనే క్యాప్షన్‌తో విడుదలైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ ట్రైలర్ తో సిరీస్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రేమ సైకోసిస్‌గా మారితే
ఈ సిరీస్ స్టోరీ మానవ సంబంధాల వెనుక ఉండే చీకటి కోణాలను స్పృశిస్తుంది. మనుషుల మధ్య ఉండే ప్రేమ, నమ్మకం అబ్సెషన్ గా మారి, అతిగా ఉంటే ఏమవుతుందో ఇందులో అత్యంత ఆసక్తికరంగా చూపించబోతున్నారు. మనం అమితంగా ప్రేమించే వ్యక్తే మనకు ఒక ముప్పుగా, భయానకమైన బెదిరింపుగా మారినప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, దాగి ఉన్న ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నల చుట్టూ కథనం సాగుతుంది.


Post a Comment